స్మాల్ బిజినెస్ ఐడియాస్ : Small Business Ideas in Telugu

ఎలక్ట్రికల్ టెప్స్ తయారీ బిసినెస్

ఎలక్ట్రీషియన్ వర్క్ చేసే వాళ్ళకి, కేబుల్ వర్క్ చేసే వారికి ఈ ఎలక్ట్రికల్ టెప్స్ లేకుంటే అసలు పనే జరగదు. ఈ బిజినెస్ లో మనకు టార్గెట్ ఎవరు అంటే ఎలక్ట్రికల్ షాప్స్ మరియు హోల్ సెల్ల్, రిటైల్, ఫాన్సీ షాప్స్, బుక్ స్టోర్స్, స్టేషనరీ షాప్స్ మొదలగునవి. ప్రతి చిన్న పనికి ఈ ఎలక్ట్రికల్ టేప్ అవసరం. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ టేప్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది అని చెప్పవచ్చు.

ఈ బిసినెస్ గురించి తెలుసుకోవాలిసిన ముఖ్యమైన విషయాలు

  1. ఈ బిసినెస్ సంబంధించిన రా మెటీరియల్ ఏంటి?
  2. వాటి ఇన్వెస్టమెంట్ ఎంత?
  3. ప్రాఫిట్స్ అలా వుంటాయి?
  4. మార్కెటింగ్ ఎలా చేయాలి?

పైన ఉన్న వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవాలిసిందే!

ఈ ఎలక్ట్రికల్ టెప్స్ తయారు చేయడానికి కావాలిసింది ఇన్సులేటెడ్ టేప్ కటింగ్ మేకింగ్ మెషీన్ . ఈ మెషీన్ ధర 1,20,000 వరకు వుంటుంది. ఇంకా రెండవది ఎలక్ట్రికల్ టెప్స్ రోల్స్. ఈ రోల్స్ మనకు ఒక బండిల్ 200-300 రూపాయలు వరకు వుంటుంది. ఇంకా మూడవది ప్యాక్కింగ్ కోసం అవసరం అయ్యే కాటన్ బాక్స్.

ఈ మెషీన్ ఎలా వర్క్ చేస్తుందో క్రింద ఉన్న వీడియో ద్వారా తెలుసుకుందాం…

ముందుగా మనం తెచ్చుకున్న రా మెటీరియల్స్ ను మెషీన్ లో అమార్చవలసి వుంటుంది. ఇలా అమర్చిన తరువాత ఏ మెషీన్ లో హ్యాండిల్ తో కూడిన కట్టర్ వుంటుంది. ఈ కట్టర్ ద్వారా మనం టేపులను చిన్న చిన్న సైజ్ లుగా కట్ చేసుకోవచ్చు. ఇలా వచ్చినా టేప్ లను కాటన్ బాక్స్ లో ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేయవచ్చు.

నోట్ : ఒక వేళ మీకు అర్థము కాకపోతే పైన వీడియోను 1-2 సార్లు చూస్తే అర్థం అవుతుంది.

ప్రాఫిట్స్ ఎలా వుంటాయో చూద్దాం?

ఒక టేప్ తయారీకి అన్ని ఖర్చులతో కలిపి ₹5 అవుతుంది. కావున ₹1 ప్రాఫిట్ వేసుకుని ₹6 కి సేల్ చేస్తాం. ఈ టేప్ ను మార్కెట్ లో ₹10 కి సేల్ చేస్తారు, అంటే హోల్ సెల్లెర్ కి, రీటైలర్ కి ₹4 మార్జిన్ వుంటుంది.

ఉదాహరణ:

ఈ మెషీన్ ద్వారా రోజుకు మనం 3000 టేపులు తయారు చేస్తాం అని అనుకుండి. ప్రాఫిట్ మనం ₹1 వేసుకుంటే ఒక రోజుకి ₹3000 దాకా సంపాదించవచ్చు. ఇలా ఒక నెలకి ప్రాఫిట్ వేసుకుంటే దాదాపు ₹75,000 వరకు వస్తుంది.

మార్కెటింగ్ ఎలా చేయాలో చూద్దాం?

ముందుగా మీ ఏరియా లో గాని లేదా మీ మండలంలోని ఎలక్ట్రికల్ షాప్స్ మరియు వారి నెంబర్ లను ఒక లిస్ట్ చేసుకోవలను. మీరు బిసినెస్ వాట్సాప్ ద్వారా మెసేజ్ లు డైలీ పంపిస్తూ ఉండాలి. మెసేజ్ ఎలా వుండాలి అంటే మన ప్రొడక్ట్ రేట్ ఎంత, తయారీ విధానం ఏంటి, క్వాలిటీ ఏంటి , వీడియోస్ రూపములో పంపిస్తూ వుండాలి. ఈ విధంగా పెట్టడం వల్ల ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. మనం ఇంటి దగ్గర నే వుంటూ మొబైల్ ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ బిసినెస్ ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

ఈ బిజినెస్ కోసం మెటీరియల్స్ కావాలంటే మా whatsapp నెంబర్ కు మెసేజ్ చేస్తే మీకు తెలియచేస్తాం,

Anusha Reddy

Hi Guys! My name is Anusha Reddy and I’m 21 years old blogger. A Telugu blog helps that all Telugu people to simple and easy understand the technology updates. Here you can see complete information about Latest technology related News and latest News, Fashion, Home Appliance and Mobile & Gadget Reviews .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *